Matrimonial ADVT Viral: సంబంధం చూడమన్నారు.. కానీ 'సాప్ట్‌వేర్ ఇంజనీర్' వద్దన్నారు.. వైరల్‌గా మారిన పెళ్లి ప్రకటన

Matrimonial ADVT Viral: ఐటీ చదువు.. అమెరికాలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అమ్మాయి సుఖపడాలంటే ఇంతకంటే ఏం కావాలి అని అనుకునేవారు ఒకప్పుడు అమ్మానాన్నలు. అమెరికా సంబంధం, సాప్ట్‌వేర్ ఉద్యోగం అంటే అమ్మాయిలు, అమ్మలు కూడా ఎగిరి గంతేసేవారు.. కానీ ఈ మధ్య తల్లిదండ్రులు వాళ్ల ఆలోచనలను మార్చుకుంటున్నట్టు ఈ ప్రకటన చూస్తే అర్థమవుతోంది.
ఈ మధ్య కొన్ని మ్యాట్రిమోనియల్ ప్రకటనలు వైరల్ అవుతున్నాయి. అమ్మాయి లేదా అబ్బాయి ఎలా ఉంటే నచ్చుతారో చెప్పేస్తున్నారు.. ఇలాంటి ప్రకటనలు కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. మా అమ్మాయికి తగిన వరుడు కావాలని అంటూనే.. సాప్ట్‌వేర్ ఇంజనీర్ అయితే సంప్రదించాల్సిన అవసరం లేదు అని ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు..
బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన ఎంబీఏ పూర్తి చేసిన మా అమ్మాయికి ఐఏఎస్/ఐపీఎస్, వైద్యుడు, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ అయిన వరుడు కావాలి. ఏ ఒక్క అర్హత ఉన్నా సంప్రదించగలరు అని ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్‌ను వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'ఐటీ భవిష్యత్ బాగాలేదు' అని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
ఓ యూజర్ స్పందిస్తూ.. ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తే లేదు అని అంటే మరొక యూజర్.. మేం మరీ అంత చెడ్డవాళ్లమా అని తన ఆవేదన వ్యక్తం చేశాడు.. మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.. దేవుడికి ధన్యవాదాలు.. నాకు పెళ్లై 11 ఏళ్లు అవుతోంది అని రాసుకొచ్చాడు.
Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2
— Samir Arora (@Iamsamirarora) September 16, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com