వైరల్

Video Viral: వామ్మో.. విమానంలో భోజనం.. ప్లేట్‌లో పాము తల..

Video Viral: విమానంలో ప్రయాణం చేస్తున్న సిబ్బందికి క్యాటరింగ్ కంపెనీ అందించిన భోజనం చూసి షాక్ అయ్యారు.. అందులో పాము తల కనిపించే సరికి అతడికి వాంతి వచ్చినంత పనైంది.

Video Viral: వామ్మో.. విమానంలో భోజనం.. ప్లేట్‌లో పాము తల..
X

Video Viral: విమానంలో ప్రయాణం చేస్తున్న సిబ్బందికి క్యాటరింగ్ కంపెనీ అందించిన భోజనం చూసి షాక్ అయ్యారు.. అందులో పాము తల కనిపించే సరికి అతడికి వాంతి వచ్చినంత పనైంది.

టర్కీకి చెందిన విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలోని భోజనంలో తెగిపడిన పాము తలని గుర్తించి భయపడిపోయాడు. జూలై 21న టర్కీలోని అంకారా నుండి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్ ఎక్స్‌ప్రెస్ విమానంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ సిబ్బంది తాము తింటున్న భోజనం ప్లేటులో ఒక చిన్న పాము తల బంగాళదుంప కూర మధ్యలో ఉన్నట్లు గుర్తించారు.

ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో పాము తల ఫుడ్ ట్రే మధ్యలో ఉంది. సన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి టర్కిష్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ సంఘటన "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని అన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

"విమానయాన పరిశ్రమలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. అందువలన మా విమానంలో ప్రయాణించే అతిథులకు మేము అందించే సేవలు అత్యధిక నాణ్యతతో ఉంటాయి. మా అతిథులు, మా సంస్థలో పని చేసే ఉద్యోగులు ఇరువురూ సౌకర్యవంతమైన, సురక్షితమైన విమాన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఆహార సేవకు సంబంధించి పత్రికలో వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. అయినప్పటికీ మేము దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

మరోవైపు, భోజనాన్ని సరఫరా చేసిన క్యాటరింగ్ కంపెనీ కూడా సిబ్బందికి అందించిన భోజనంలో పాము తల ఉంది అని పేర్కొన్న విషయాన్ని కొట్టిపారేసింది. వంట చేసేటప్పుడు ఆహారంలో ఉండే విదేశీ వస్తువులను ఏదీ అందించలేదు" అని కంపెనీ పేర్కొంది. క్యాటరింగ్ కంపెనీ తన భోజనం 280 డిగ్రీల సెల్సియస్‌లో వండుతారు కాబట్టి, తాజాగా కనిపించే పాము తల వాస్తవం కాదని పేర్కొంది.

Next Story

RELATED STORIES