వినూత్న రీతిలో హోలీ వేడుకలు.. పురుషులు చీరలు కట్టుకుని..
By - TV5 Digital Team |29 March 2021 10:00 AM GMT
హోలీ పండుగ వస్తే రంగులు చల్లుకోవడం సర్వసాధారణం. కానీ.. ఆ ఊరులో మాత్రం మోలీ పండుగను అందుకు భిన్నంగా జరుపుకుంటారు.
హోలీ పండుగ వస్తే రంగులు చల్లుకోవడం సర్వసాధారణం. కానీ.. ఆ ఊరులో మాత్రం మోలీ పండుగను అందుకు భిన్నంగా జరుపుకుంటారు. పురుషులు చీరలు కట్టుకుని బసవేశ్వరాలయంలో రతి మన్మధ పూజలు నిర్వహిస్తారు. కర్ణాటక సరిహద్దులో ఉండే సొంత కల్లూరులో ఈ వింత వేడుకలు జరుగుతాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సొంత కల్లూరులో జరిగిన హోలీపండుగకు ఎపి,కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు.. గ్రామానికి చెందిన పలువురు పురుషులు చీరలు కట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. రతీమన్మధుల రథోత్సవం,కామదహనం,శివయాత్రలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com