వైరల్

Video Viral: ఇదేం ఆచారంరా బాబు.. మొసలికి ముద్దులు, మెడలో మూడు ముళ్లు..

Video Viral: గాడిదలను, శునకాలను పెళ్లిళ్లు చేసుకునే వాళ్లను చూస్తున్నాము.. ఇప్పుడు మొసలిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్..

Video Viral: ఇదేం ఆచారంరా బాబు.. మొసలికి ముద్దులు, మెడలో మూడు ముళ్లు..
X

Video Viral: గాడిదలను, శునకాలను పెళ్లిళ్లు చేసుకునే వాళ్లను చూస్తున్నాము.. ఇప్పుడు మొసలిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్..అది వారి ఊరి ఆచారం అని, ఇదేమీ ఆశ్చర్యపోవలసిన సంఘటన కాదని అంటున్నారు గ్రామస్థులు.

ఈ సంఘటన మెక్సికోలోని ఓక్సాకా అనే చిన్న మత్స్యకార గ్రామంలో జరిగింది. అక్కడ శాన్ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోసా తెల్లటి దుస్తులు ధరించిన ఏడేళ్ల మొసలిని వివాహం చేసుకున్నారు. అతను మొసలిని ముద్దాడి మురిసిపోయాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను రాయిటర్స్ షేర్ చేయగా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇటీవలి రోజుల్లో కనిపించిన అనేక వీడియోల కంటే ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పురాతన ఆచారాల ప్రకారం మేయర్ మొసలిని వివాహం చేసుకున్నారు. ప్రకృతి అనుగ్రహం కోసం చేసే ప్రార్థనలో భాగంగా ఇలాంటి వివాహాలు చేసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం.

సరీసృపాలు మాతృమూర్తిని సూచించే దేవతలుగా విశ్వసిస్తారు. ఇద్దరి కలయిక మానవులు దైవంతో కలిసిపోవడాన్ని సూచిస్తుంది. ట్రంపెట్‌లు, డోలు వాయిద్యాలు, డ్యాన్స్‌లు మధ్య ఈ వేడుక జరిగింది. మేయర్ వధువును తన చేతుల్లోకి తీసుకుని వీధిలోకి వచ్చాడు. అతడితో పాటు వెళ్లిన వ్యక్తులు తమ టోపీలను మొసలికి అమర్చారు.

వివాహాన్ని నిర్వహించిన గాడ్ మదర్ ఎలియా ఎడిత్ అగ్యిలర్ మాట్లాడుతూ, "ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మా సంప్రదాయాలను పాటిస్తున్నందుకు గర్వంగా ఉంది అని అన్నారు. ఇది చాలా అందమైన సంప్రదాయం అని ఆయన తెలిపారు.

ప్రకృతిని ప్రార్థిస్తున్నాము తగినంత వర్షం, ఆహారం కోసం. అందులో భాగమే ఇది అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 2 లక్షలమంది వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు.

Next Story

RELATED STORIES