Midnight Runner: అర్థరాత్రి పరుగు.. యువకుడికి ఆర్థిక సాయం..

Midnight Runner: అర్థరాత్రి పరుగు.. యువకుడికి ఆర్థిక సాయం..
Midnight Runner: అనారోగ్యంతో ఆస్పత్రిలో అమ్మ.. అయినా తన లక్ష్యం కోసం పగలంతా డ్యూటీ చేసి అర్థరాత్రి పరుగు తీస్తున్నాడు..

Midnight Runner: అనారోగ్యంతో ఆస్పత్రిలో అమ్మ.. అయినా పగలంతా డ్యూటీ చేసి అర్థరాత్రి పరుగు తీస్తున్నాడు.. తన లక్ష్యం కోసం కష్టపడుతున్నాడు. ముంబై రోడ్ల మీద పరుగు పెడుతున్న ఆ యువకుడిని చూసి లిప్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు.. మీ కారెక్కితో ఒక రోజు వేస్టయిపోతుందని బదులిచ్చాడు.. అతడితో జరిపిన సంభాషణ, అతడి పట్టుదల చూసిన దర్శకుడు వినోద్ కాప్రీకి ఆ యువకుడిని చూసి ముచ్చటేసింది..

నీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది అని అన్నాడు యువకుడితో.. అవనివండి సార్.. నేను చేసేది ఏం తప్పుకాదుగా అని బదులిచ్చి మళ్లీ పరుగులంఘించుకున్నాడు.. నిజంగానే వినోద్ కాప్రీ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ప్రదీప్ మెహ్రాపై ప్రశంశలు వెల్లువెత్తాయి. షాపర్స్ స్టాప్ వాళ్లనుంచి ప్రదీప్ కి ఆర్ధిక సాయం కూడా అందింది.. అమ్మ చికిత్స కోసం, అతడి లక్ష్యం కోసం 2.5 లక్షలు ఆర్థిక సాయం అందించింది రిటైల్ దుస్తుల బ్రాండ్ షాపర్స్ స్టాప్.

ప్రదీప్ తల్లి ఆసుపత్రిలో ఉంది. అతను ప్రస్తుతం తన అన్నయ్యతో కలిసి ఓ రూమ్ లో ఉంటున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ నోయిడాలోని సెక్టార్ 16లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని షిఫ్ట్ ముగిసిన తర్వాత, బస్సు లేదా ఆటో ఎక్కకుండా పరుగు తీసుకుంటూ రూమ్ కి చేరుకుంటాడు. ఈ పరుగుని అతడి దినచర్యలో భాగం చేసుకున్నాడు. ఆర్మీలో చేరాలంటే ఫిట్ గా ఉండాలి.. అందుకే ఈ పరుగు అంటాడు ప్రదీప్. అతని కథ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.





Tags

Next Story