Viral News: కూర్చోలేదు.. అయినా కోట్లు సంపాదన..ఓ మోడల్‌ విచిత్ర పరిస్థితి

Viral News: కూర్చోలేదు.. అయినా కోట్లు సంపాదన..ఓ మోడల్‌ విచిత్ర పరిస్థితి
X
Viral News: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులోనూ మహిళలు చక్కగా కనిపించడానికి ఎన్నో రకాల మేకప్‎లు వేసుకుంటారు.

Buttock Surgery: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులోనూ మహిళలు చక్కగా కనిపించడానికి ఎన్నో రకాల మేకప్‎లు వేసుకుంటారు. ప్రముఖులైతే ఆకర్షణీయంగా కనిపించడం కోసం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటారు. ఆ కోవకే చెందింది ఓ ప్రముఖ మోడల్... ఆకర్షిణీమైన శరీర ఆకృతి కోసం ఆపరేషన్ చేయించుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. ఆ సర్జరీ తర్వాత ఆమె కూర్చోవడానికి కూడా కష్టపడుతుంది. అయితే అదృష్టం మాత్రం ఆమెతోనే ఉంది. కూర్చొవడానికే ఇబ్బంది పడుతూన్న ఈ మోడల్ కోట్లు వెనకేస్తుంది. ఇంతకీ ఆమె కథ ఏంటో తెలుసుకుందాం..

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన 24ఏళ్ల మోడల్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈమె ఇన్‌స్టాగ్రాంలో పాపులారిటీ సంపాదించింది. ఈ మోడల్ కు ఇన్‌స్టాలో ఫాలోవర్లు సంఖ్య మాములుగా లేదు. తనకు సంబంధించిన ఏ ఫొటో అప్‌లోడ్ చేసినా లైకులు, షేర్లు, కామెంట్‌ల్లో ఇన్ స్టా షేక్ అవుతుంది.

ఈ నేపథ్యంలో మోడల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తాను మరింత అందంగా కనిపించేందుకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయింది. దాని ద్వారా మరింత ఆకర్షణీయంగా తన శరీరాకృతి మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ ప్రక్రియ కోసం సుమారు 20వేల డాలర్లు (దాదాపు రూ. 14.8లక్షలు) ఖర్చు చేసింది. బ్రెజీలియన్ బట్ లిఫ్ట్(Brazilian butt lift) ద్వారా బాడీలోని కొవ్వును తొలగించుకుంది. దాంతో మరింత అందంగా మారింది. కానీ.. పిరుదల భాగంలో ఉన్న కొవ్వును కూడా తొలగించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

అక్కడ కొవ్వు తొలిగించడంతో ఆమె సరిగ్గా కూర్చోలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే దురదృష్టంలోనూ ఆమెకు అదృష్టం తోడుగా ఉండటంతో ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలను సంపాదిస్తోంది. ఓన్లీ‌ఫ్యాన్స్ వెబ్‌సైట్ ద్వారా గతంలో నెలకు సుమారు 25వేల డాలర్లను సంపాదించాననీ.. ప్రస్తుతం 2లక్షల డాలర్ల సంపాదిస్తున్నాని తెలిపింది. తాజాగా ఆమె 1.5 మిలియన్ డాలర్లను పొందినట్టు వెల్లడించింది. ఇప్పటికే సర్జరీ ద్వారా ఎన్నో అవస్తలు పడుతున్న ఈ మోడల్ మళ్లీ చికిత్స తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. గతంలో మాదిరి మాములు స్థితికి వచ్చేలా ఎలాంటి చికిత్సలు తీసుకోనని స్పష్టం చేసింది. జరిగిపోయిందాని గురించి బాధపడనని ప్రకటించింది.



Tags

Next Story