Video Viral: పానీ పూరీ అమ్ముతూ.. చదువుకుంటూ..
Video Viral: బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం చేయాలి.. అమ్మానాన్నకు ఆసరా కావాలి. కానీ ఆర్థిక స్థోమత అంతంత మాత్రం. పై చదువులు చదివించేందుకు తండ్రి దగ్గర తగినంత డబ్బు లేదు. దీంతో పూనమ్ ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనుకుంది. అమ్మానాన్న మీద ఆధారపడకుండా ఉండాలనుకుని ఆలోచించింది.
ముందు ఓ డెంటల్ క్లినిక్‌లో పని చేసింది. కానీ ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు చదువుకోడానికి సమయం దొరికేది కాదు. దాంతో కొన్ని రోజులు అక్కడ పని చేసి మానేసింది. కానీ చదువుకునేందుకు డబ్బులు కావాలి. ఖాళీగా కూర్చుంటే కష్టమని భావించింది.
ఛాట్ భండార్ పెట్టుకుంటే పగలంతా చదువుకోవచ్చు. సాయింత్రం పూట స్టాల్ నడుపుకోవచ్చని అనుకుంది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం ఏకీభవించలేకపోయింది. కానీ సమయం గడిచేకొద్దీ పూనమ్ స్టాల్‌కి కస్టమర్లు రావడం, ఆర్థికంగా కూతురు అండగా నిలవడంతో తండ్రి ఎంతో సంతోషించాడు.
చదువుల్లోనూ రాణిస్తున్న కూతురిని చూసి పొంగిపోతున్నాడు తండ్రి. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు 8.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com