కొత్త జంట తలలపై దూకి వానరం చేసిన పని చూస్తే..
కరోనా సీజన్‌లో జరుగుతున్న పెళ్లిల్లలో అతిథులు కరువైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో అనుకోని అతిథిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్విదించింది ఓ వానరం. పెళ్లి జరుగుతుండగా... ఒక్కసారిగా జంటపై దూకింది. ముందుగా పెళ్లి కొడుకు నెత్తిపైకి ఆ తర్వాత పెళ్లి కూతురు తలపై దూకింది. పనిలోపనిగా... జీలకర్ర, బెల్లం ఎత్తుకెళ్లింది. ఈ ఘటన... ములుగు జిల్లా వాజేడు మండలంలో మల్లూరు నరసింహస్వామి ఆలయంలో జరిగింది.
పెళ్లిమండపంలో వానరం సందడికి కొందరు షాక్ అవగా... మరికొందరు మాత్రం.. వానరం ఆశీర్వదించిందని సంతోష పడ్డారు. గతంలోనే పెళ్లి ముహూర్తం నిర్ణయించిన్పటికీ.. కరోనా వల్ల వాయిదా పడింది. గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో... నరసింహస్వామి ఆలయంలో పెళ్లి ఫిక్స్ చేశారు. వధూవరులు భారత్, నాగమణి పెళ్లి పీటల మీద ఉండగా... వానరం వచ్చి... ఇలా హల్‌చల్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com