కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న కోతి.. !

కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న కోతి.. !
ఒక కోతి జాతి ధర్మాన్ని మరిచి కుక్కపిల్లను అక్కున చేర్చుకుంది. తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది.

ఒక కోతి జాతి ధర్మాన్ని మరిచి కుక్కపిల్లను అక్కున చేర్చుకుంది. తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. చిన్న కుక్కను ఆ కోతి చేతుల్లో పట్టుకొని, గుండెకు హత్తుకొని బిడ్డలా చూసుకుంటోంది. గత 10 రోజులుగా రెండూ కలిసే తిరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. కుక్కను ఏదైనా చేస్తుందేమోనని భయపడిన స్థానికులు వాటిని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో వారు రెండు జీవాలకు ఆహారం అందిస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమను ఎప్పుడు కూడా చూడలేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story