తల్లిప్రేమ.. బిడ్డను రక్షించుకోవాలనే తాపత్రయంతో పరుగులు..

X
By - Nagesh Swarna |20 Dec 2020 11:48 AM IST
ఓ మూగజీవి గాయపడిన తన బిడ్డను కాపాడుకొవటానికి చేసిన ప్రయత్నం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తల్లి ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. తమ పిల్లలను కాపాడుకొనే విషయంలో ప్రతి జీవి తన ప్రాణాలను సైతం అడ్డుపెడుతుంది. తాజాగా ఓ మూగజీవి గాయపడిన తన బిడ్డను కాపాడుకొవటానికి చేసిన ప్రయత్నం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
రోడ్డుపై ఉన్న ఆవు దూడను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ ఆవు దూడ తీవ్రంగా గాయపడింది. స్థానికులు రిక్షాపై గాయపడిన దూడను స్థానిక హాస్పిటల్‌కి తరలిస్తుండగా.. తల్లి ఆవు ఆ రిక్షా వెనుకే పరుగు పెట్టింది. తమ బిడ్డను రక్షించుకోవాలనే తాపత్రయంతో హాస్పిటల్ వరకూ అలా రిక్షా వెనుకే పరుగులు పెడుతూ వెళ్లింది. ఒడిశాలోని మాల్కాన్‌గిరిలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com