భర్త పట్టించుకోలే.. ప్రియురాలుకి కోటిన్నరకు అమ్మేసిన భార్య!

డబ్బు మీదా ఉన్న మోజుతో తన భర్తను మరో మహిళకు అమ్మడానికి సిద్దపడుతుంది శుభలగ్నం సినిమాలో హీరోయిన్ ఆమనీ.. సరిగ్గా ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది.. కానీ స్టొరీ కాస్తా డిఫిరెంట్.. భర్త మరో మహిళ మోజులో పడి తనని, తన పిల్లలను పట్టించుకోవడం లేదని భర్తను కోటిన్నరకు అమ్మేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ బాలిక.. తన తండ్రి అతను పనిచేసే ఆఫీసులో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీనితో ఇంట్లో గొడవలు అవుతున్నాయని, ఈ గొడవల వలన తానూ, తన చెల్లెలు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని ఫ్యామిలీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. దంపతులిద్దరిని కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలవగా, తానూ తన భార్యతో కాకుండా మరో మహిళతోనే ఉంటానని తేల్చి చెప్పేశాడు.
ముందుగా దీనికి ఒప్పుకోలేదు అతని భార్య.. ఆ తరవాత తన భర్తను ఆ మహిళకు అప్పగించాలంటే తన భర్త ప్రియురాలు తనకు రూ. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి ఒకే చెప్పిన ఆ ప్రియురాలు .. తన ఖరీదైన అపార్ట్‌మెంట్ తో పాటుగా రూ .27 లక్షల నగదును ఆమెకు అప్పగించింది. తనను, తన పిల్లలను పట్టించుకోని ఇలాంటి వ్యక్తితో కలిసి బ్రతకడం వ్యర్ధమని, కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ డబ్బును డిమాండ్ చేసినట్టుగా ఆ మహిళ కోర్టుకు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com