63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి!

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లికి సిద్దమయ్యాడు గుజరాత్ లోని ఓ రైతు. సూరత్ ప్రాంతానికి చెందిన ఆ రైతు పేరు అయూబ్ దెగియా. ఈ రైతుకి ఇప్పటికే ఆరు పెళ్ళిళ్ళు అయ్యాయి. గతేడాది తనకంటే చిన్నవయసున్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏడో పెళ్ళికి ఆ వృద్ధుడు చెబుతున్న కారణం ఏంటో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే.
తన ఆరో భార్య శృంగారానికి అంగీకరించడంలేదని.. అందుకే తాను ఏడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా తనకు గుండె సంబంధింత సమస్యలు, డయాబెటిస్, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయని, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని కోరుకుంటున్నానని, అందుకే తానూ మరో పెళ్ళికి సిద్దమైనట్టుగా వెల్లడించాడు.
అయితే తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో అతనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి పెళ్లి చేసుకొని, వాడుకొని ఏదో ఒక కారణం చూపించి వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది.
అయితే తమ అచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం రివాజేనని నిందితుడు వాదించడం కొసమెరుపు!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com