Smriti Irani : ములాయం సింగ్‌ పాదాలకు నమస్కరించిన కేంద్రమంత్రి...!

Smriti Irani :  ములాయం సింగ్‌ పాదాలకు నమస్కరించిన కేంద్రమంత్రి...!
Smriti Irani : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు.

Smriti Irani : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈక్రమంలో తొలి రోజున పార్లమెంట్‌ ఆవరణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సమాజ్‌‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ పాదాలను కేంద్రమంత్రి స్మతి ఇరానీ నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్‌‌గా మారింది.

వీడియోలో చూసినట్టు అయితే.. ములాయం సింగ్ యాదవ్ జాగ్రత్తగా మెట్లు దిగుతుండగా, ఆయన్ని చూసిన మంత్రి స్మృతి ఇరానీ.. ఆయన వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అదే సమయంలో మరో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కూడా ములాయం సింగ్‌ దగ్గరకు వెళ్లి ఆయన్ను చేతపట్టుకొని కిందకు దిగేందుకు సహకరించారు.

యూపీ ఎన్నికల్లో మాటలు తూటాలు పేలుతున్న వేళ ఇలాంటి దృశ్యం కనిపించడంతో పలువురు ఎంపీలు ఫోటోలు తీశారు. కాగా ఇటీవల ములాయం సింగ్ కోడలు అపర్ణా యాదవ్‌ బీజేపీలో చేరిన అనంతరం లక్నోలో ఉన్న తన మామ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story