Mumbai Rains: వీధుల్లో ప్రవహిస్తున్న వరద నీరు.. 'ఆరా ఫార్మింగ్' నృత్యం చేస్తున్న వ్యక్తి..

ముంబై శివారు ప్రాంతమైన ముంబ్రాలోని వరదలతో నిండిన వీధిలో ఒక వ్యక్తి వైరల్ అయిన ఆరా ఫార్మింగ్ నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సిటీ వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి.
"బోట్ డ్యాన్స్" అని కూడా పిలువబడే ఆరా ఫార్మింగ్ డ్యాన్స్, 11 ఏళ్ల ఇండోనేషియా బాలుడు రేయాన్ అర్కాన్ దిఖా ప్రదర్శించిన తర్వాత ప్రజాదరణ పొందింది. గత నెలలో ఆ బాలుడు చేసిన బోట్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాడు. ఇప్పుడు ముంబై వ్యక్తి ఆరా ఫార్మింగ్ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ ముంబ్రా ఎక్స్‌ప్రెస్ “ముంబ్రాకర్స్” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. వీడియోలో, ఆ వ్యక్తి వర్షపు నీటిలో మునిగిపోయిన డివైడర్‌పై డ్యాన్స్ చేశాడు. కొన్ని క్షణాల తర్వాత, అతను నీటితో నిండిన వీధిలోకి దూకి, తనతో తీసుకెళ్లిన తాత్కాలిక చాపపై వాలాడు.
ఆ వీడియో వైరల్ కావడంతో, నీటితో నిండిన వీధిలో ఆరా ఫార్మింగ్ నృత్యం చేయాలనే ఆ వ్యక్తి నిర్ణయంపై సోషల్ మీడియా వినియోగదారులు నవ్వు ఆపుకోలేకపోయారు.
"తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు" అని మరొకరు రాశారు.
ఇండోనేషియాలోని ఒక గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి రయాన్ అర్కాన్ ధికా రేసింగ్ బోట్‌పై చేసిన నృత్యం వైరల్ అయింది. దాంతో ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఈ ఆరా ఫార్మింగ్ నృత్యాన్ని అనుకరించడం మొదలు పెట్టారు.
రయ్యన్, సాంప్రదాయ తెలుక్ బెలాంగా దుస్తులు మరియు మలయ్ రియావు తలకు వస్త్రం ధరించి, రేసింగ్ పడవ ముందు భాగంలో నిలబడి, చేతులు ఊపుతూ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
"ఈ నృత్యాన్ని నేనే స్వయంగా కనిపెట్టాను," అని అతను BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, "ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది." ఇది ఇంతమందిని ఆకట్టుకుంటుందని, వైరల్ అవుతుందని అసలు ఊహించ లేదు అని తెలిపాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com