జైల్లో ఘనంగా ఖైదీ పుట్టినరోజు వేడుకలు.. వీడియో వైరల్!

జైల్లో ఘనంగా ఖైదీ పుట్టినరోజు వేడుకలు.. వీడియో వైరల్!
బెంగళూరులోని సుబ్రమణియపురకి చెందిన రిజ్వాన్‌ ఓ మర్డర్ కేసులో అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. రిజ్వాన్ 2019 ఏప్రిల్ నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

నేరం చేసి జైలుకు వెళ్ళిన ఖైదీలకు అక్కడ పోలీసులు అమలు పరిచే శిక్షలు మాములుగా ఉండవు. ఒక్కసారి జైలుకి వెళ్తే మళ్ళీ నేరాలు చేయాలంటే సహజంగానే భయమేస్తుంది. కానీ కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు అధికారుల తీరు చూస్తే మాత్రం ఒక్కసారైనా సరే నేరం చేసి జైలుకు వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఖైదీలకి అంత స్వేచ్ఛ ఉంది మరి. తాజాగా బయటపడిన ఓ వీడియోనే ఇందుకు చక్కటి ఉదాహరణ.. జైల్లో ఓ ఖైదీ పుట్టినరోజు వేడుకల చాలా ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

బెంగళూరులోని సుబ్రమణియపురకి చెందిన రిజ్వాన్‌ ను ఓ మర్డర్ కేసులో అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. రిజ్వాన్ 2019 ఏప్రిల్ నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.. అక్టోబర్‌లో డీసీపీ హరీష్ పాండే నేతృత్వంలోని సౌత్ డివిజన్ పోలీసులు అతనిపై గూండా చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే అతని అనుచరులు వివధ కేసుల్లో నేరస్తులుగా అదే జైలులో ఉన్నారు. తాజాగా రిజ్వాన్‌ పుట్టిన రోజు సందర్భంగా రిజ్వాన్‌ తన స్నేహితులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు. జరుపుకోవడమే కాకుండా ఈ వేడుకను మొత్తం వీడియో తీశారు.

ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో వీడియో వైరల్ అవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ విషయం కాస్తా జైలు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళడంతో బర్త్‌ డే ఘటనపై విచారణ చేస్తున్నామని, రిజ్వాన్‌కు ఫోన్‌ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని స్థానిక మీడియాకి వెల్లడించారు. కాగా, పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సంప్రదాయం అయితే ఉంది కానీ మొబైల్స్ కి అనుమతి లేదు.

Tags

Next Story