Nagaland: నాగాలాండ్‌ విద్యామంత్రి వీడియో వైరల్.. స్కూల్ స్పీచ్‌లో..

Nagaland: నాగాలాండ్‌ విద్యామంత్రి వీడియో వైరల్.. స్కూల్ స్పీచ్‌లో..
Nagaland: కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ అంటూ నాగాలాండ్‌ విద్యామంత్రి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.

Nagaland: కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ అంటూ నాగాలాండ్‌ విద్యామంత్రి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి. మంత్రి తెమ్జెన్‌ ఇన్మా తనపై తాను వేసుకున్న జోకులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కళ్లు చిన్నగా ఉంటాయని కొందరు వెక్కిరిస్తుంటారన్నారు తెమ్జెన్. ఔను మా కళ్లు చిన్నగానే ఉంటాయి. కానీ చాలా మంచిగా చూడగలమన్నారు.

చిన్న కళ్లు ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయని వివరించారు. కళ్లల్లో దుమ్ము, ధూళి తక్కువగా చేరుతుందని.. అదేగాక, భారీ సమావేశాల్లో అధిక సమయం స్టేజిమీద కూర్చున్నప్పుడు నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈవీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags

Next Story