Naked Women-Firing: నడిరోడ్డుపై నగ్నంగా.... కాల్పులు జరిపిన మహిళ

నగ్నంగా మారిన ఓ మహిళ కారులోంచి దిగి గాల్లోకి కాల్పులు జరిగిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హైవే పెట్రోల్ పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ విస్తుపోయే ఘటన జులై 25న మంగళవారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బిజీగా ఉన్న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జిపై అకస్మాత్తుగా మహిళ నగ్నంగా మారి, తుపాకీతో కాల్పులు జరిపింది. రోడ్డుకు అడ్డంగా నడుచుకుంటూ వెళ్తూ కార్లపై, గాల్లోకి కాల్పులు జరిపింది. భయాందోళనకు గురైన ఇతర ప్రయాణికులు 911 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో, వెంటనే అక్కడికి చేరుకున్న హైవే ప్యాట్రోలింగ్ పోలీసులు ఆమెని అదుపులో తీసుకున్నారు.ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం, గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఈ ఘటన వెనక కారణాలను పోలీసులు దర్యాప్తు చేయనున్నామని వెల్లడించారు.
ఆమె ఈ విధంగా ఎందుకు ప్రవర్తించిందో కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆమెని స్థానిక ఆసుపత్రికి తరలించి, మానసిక స్థితి, ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్నారు. తర్వాత ఆమె ఈ ఘటనకు సంబంధించి పోలీస్ కేసు ఎదుర్కోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com