Nancy Crampton: 'భర్తను చంపడం ఎలా?' పుస్తకం రాసిన రచయిత్రికి భర్తను చంపిన కేసులో జీవితఖైదు..

Nancy Crampton: నాన్సీ క్రాంప్టన్.. అమెరికాలోని పోర్ట్‌లాండ్‌కు చెందిన రొమాంటిక్ నవలల రైటర్స్‌లో తాను కూడా ఒకరు. నాన్సీ రాసిన ఎన్నో నవలలు తనకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందులో ఒక నవల 'భర్తను చంపడం ఎలా?' (How to Murder Your Husband). ఆ నవల రాసిన కొన్నాళ్లకే నాన్సీ తన భర్తను హత్య చేయడం పెద్ద సంచలనాన్నే సృష్టించింది.
భర్తను చంపడం ఎలా అనే నవల రాసిన తర్వాత నాన్సీకి తన భర్తను చంపాలన్న ఐడియా వచ్చిందో లేదా చంపడానికే ఆ నవల రాసిందో తెలియదు కానీ తన నవల ఓ సెన్సేషన్‌గా మారింది. 2018 జూన్ 2న నాన్సీ.. తన భర్త డేన్ బ్రోఫీని తుపాకీతో కాల్చి హత్య చేసింది. నాలుగేళ్ల నుండి ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇక తాజాగా కోర్టు నాన్సీని హంతకురాలని తేల్చి జీవితఖైదు విధించింది.
నాన్సీ తన భర్తను హత్య చేయడం కోసం తుపాకుల గురించి గూగుల్‌లో వెతికిందని లాయర్లు తెలిపారు. భర్తను చంపే సమయానికి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండేవని.. ఒకవేళ డేన్ చనిపోతే తన భీమా డబ్బు వస్తుందన్న ఆలోచనతోనే నాన్సీ ఈ పనిచేసిందని వారు అన్నారు. నాలుగేళ్ల క్రితం అమెరికాలో సంచలనంగా మారిన ఈ కేసు.. నాన్సీ జీవితఖైదుతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com