Viral Pic: వేట కోసం మాటు వేసిన పులి.. ఈ ఫోటోలో దాగివుంది కనిపెట్టండి చూద్దాం..!

Netizens struggle to find the leopard in this pic

Phantom cat Twitter image

Leopard: సోషల్ మీడియాలో నెటిజన్స్‎కి దొరికినన్ని పజిల్స్ ఎవరికి దొరకవు. నెటిజన్లు ఎప్పటికప్పుడు పజిల్స్ పరిష్కరించాలని ఆత్రుతగా ఉంటారు.

Leopard: సోషల్ మీడియాలో నెటిజన్స్‎కి దొరికినన్ని పజిల్స్ ఎవరికి దొరకవు. నెటిజన్లు ఎప్పటికప్పుడు పజిల్స్ పరిష్కరించాలని ఆత్రుతగా ఉంటారు. తాజాగా ఇప్పుడు, ఒక మంచు కొండల రాతి భూభాగంలో చిరుత దాగివుంది. ఈ మభ్యపెట్టే ఫోటో నెటిజన్లను కట్టిపడేసింది. దీంతో ఫోటోలో చిరుత ఎక్కడ ఉందో గుర్తించే పనిలో పడ్డారు నెటిజన్లు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పులి.. ఈ ఫోటోలో ఒక రాతి పర్వత ప్రాంతంలో మంచులో ఎక్కడో దాక్కున్నట్లు చూపిస్తుంది. ఈ చిత్రం మొదట ర్యాన్ క్రాగన్ కంట పడింది. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని గమనించిన సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రమేష్ పాండే మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పజిల్‌ను పంచుకున్నప్పుడు. "ఫాంటమ్ క్యాట్" ఎక్కడదాగి ఉందో గుర్తించగలరా అని అడిగారు. దాంతో నెటిజన్లు ఫోటోను దీర్ఘంగా పరిశీలిస్తున్నారు. అనేక మంది జంతువును గుర్తించడంలో విఫలమయ్యారు. ఆఫోటోలో ఏమి లేదని కొట్టిపడేస్తున్నారు. అయితే ఈ ఫోటోలో చిరుత ఎక్కడ ఉందో మీరు కనిపెట్టండి చూద్దాం.




Tags

Next Story