Gadwal Bidda: గద్వాల్ బిడ్డ కన్నుమూత..! వైరల్ అవుతున్న వార్త..

Gadwal Bidda: గద్వాల్ బిడ్డ కన్నుమూత..! వైరల్ అవుతున్న వార్త..
X
Gadwal Bidda: ఓ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మల్లికార్జున అనే ఓ కుర్రాడు సెల్ఫీ వీడియోతో ట్రెండ్ అయ్యాడు.

Gadwal Bidda: సోషల్ మీడియా అనేది అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్ లాంటివి లేనిదే మనిషి జీవితంలోని ఒక్కరోజు కూడా గడవడం కష్టమయిపోయింది. ఈ సోషల్ మీడియా అనేది ట్రెండ్‌లోకి వచ్చిన తర్వాత అందరికీ బాగా దగ్గరయిపోయిన ఓ విషయం 'మీమ్స్'. ఈ మీమ్స్ వల్లే చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు. అలా సెలబ్రిటీ అయిపోయిన ఓ కుర్రాడు కన్నుమూసిన వార్త ఒక్కసారిగా మీమ్స్ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

ఈరోజుల్లో పాపులర్ అవ్వాలంటే ఒక స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అలాంటి వారు ఒకవేళ పాపులర్ అవ్వకపోయినా.. మీమ్స్‌కు మాత్రం కంటెంట్ అవుతారు. అలా ఆటోమేటిక్‌గా వారికి పాపులారిటీ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికీ ఇలా పాపులర్ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి ఒరిజినల్ పేర్లకంటే మీమ్ క్రియేటర్లు వారికి పెట్టిన పేర్లతో పాపులర్ అయినవారు కూడా ఉన్నారు. అందులో ఒకరు గద్వాల్ బిడ్డ.

ఓ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మల్లికార్జున అనే ఓ కుర్రాడు సెల్ఫీ వీడియోతో ట్రెండ్ అయ్యాడు. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యింది. ఆ అబ్బాయిది గద్వాల్ అని తెలిసి.. అతడికి గద్వాల్ బిడ్డ అని పేరు పెట్టేశారు మీమ్ క్రియేటర్స్. ఇటీవల గద్వాల్ బిడ్డ అస్థమాతో చనిపోయినట్టు సమాచారం అందింది. ఓ వెబ్‌సైట్‌ ఈ వార్త నిజమే అంటూ స్పష్టం చేసింది. తరచూ మీమ్స్‌లో కనిపించే ఈ కుర్రాడు చిన్న వయసులో కన్నుమూయడం సోషల్ మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Tags

Next Story