Nick Jonas: నా అందమైన భార్యకు.. నిక్ జోనస్ ఎమోషనల్ స్పీచ్

Nick Jonas: నా అందమైన భార్యకు.. నిక్ జోనస్ ఎమోషనల్ స్పీచ్
Nick Jonas: 'నా అందమైన భార్యకు...'! ప్రియాంక చోప్రా కోసం నిక్ జోనాస్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Nick Jonas: 'నా అందమైన భార్యకు...'! అంటూ ప్రియాంక చోప్రా కోసం నిక్ జోనాస్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నిక్ స్పీచ్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంది. ఈ జంటపై ప్రతి ఒక్కరు ప్రేమను కురిపిస్తున్నారు. వారి ముద్దులొలికే చిన్నారికి తమ బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు.

నిక్ జోనాస్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌ను ఆవిష్కరించారు. వేడుకలో నిక్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. అతను తన అందమైన భార్య ప్రియాంక చోప్రాకు కృతజ్ఞతలు తెలిపారు. తబ కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ గురించి ప్రస్తావించారు.

హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో జోనాస్ బ్రదర్స్ స్టార్‌ను అందుకున్నందున ఇది ప్రియాంక చోప్రాకు, ఆమె కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. తమ చిన్నారి మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌ని అందరికీ పరిచయం చేసిన సందర్భం కూడా ఇదే.

2018 ప్రియాంక చోప్రాను నిక్ జోనస్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ నిక్ తన ప్రసంగంలో వారి కుమార్తె గురించి ప్రస్తావించారు.

నిక్ తన భార్య ప్రియాంక గురించి మాట్లాడుతూ.."నా అందమైన భార్యకు, మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రశాంతంగా ఉంటారు.. మీ పనిలో నిబద్దత కనబరుస్తారు. నేను నిన్ను వివాహం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి. నేను ఓ బిడ్డకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను.

ఈవెంట్‌లో ప్రియాంక చోప్రాకు కృతజ్ఞతలు తెలుపుతూ నిక్ జోనాస్ చేసిన ప్రసంగం యొక్క వైరల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నిక్ చేస్తున్న ప్రసంగం వింటూ.. ప్రియాంక నవ్వుతూ, సిగ్గుపడుతూ, ఒకింత గర్వాన్ని ప్రదర్శిస్తే, అదే సమయంలో తన కూతురిని మురిపెంగా చూసుకుంటూ బిజీగా ఉంది. ఈ వీడియో అభిమానులను మరింత మెప్పించింది. ఒక అభిమాని వీడియోపై వ్యాఖ్యానిస్తూ, "ఈ ప్రసంగం చాలా మధురంగా​ఉంది. ప్రియాంక అమ్మ కూతురు మాల్తీని ఎంత ప్రేమగా చూస్తుందో అని ముచ్చట పడుతూ పోస్టులు పెడుతున్నారు.

Tags

Next Story