Viral News: శివుడికి కోర్టు నోటీసు.. విచారణకు హాజరుకాకుంటే 10 వేల రూపాయల జరిమానా..

Viral News: ఎంత విచిత్రం.. దేవుడికి కోర్టు నోటీసులు.. స్థలాన్ని ఆక్రమించి గుడికట్టారని అపవాదు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో జరిగింది. ఇక్కడ తహసీల్దార్ కోర్టు నోటీసులు జారీ చేసి శివుడితో సహా 10 మందికి సమన్లు జారీ చేసింది. నోటీసులో దేవుడితో సహా అందరికీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కాకపోతే 10 వేల జరిమానా విధిస్తామని తెలియజేశాారు.
శివుడికి నోటీసులు
రాయ్‌గఢ్ నగరంలోని 25వ వార్డులో శివుని ఆలయం ఉంది. సుధా రాజ్‌వాడే అనే మహిళ బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో శివుడు సహా 10 మంది వ్యక్తులు భూమిని ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై విచారణకు తహసీల్దార్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం ఈ వ్యవహారంలో శివుడితోపాటు 10 మందికి నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులో శివుని ఆలయం పేరు ఆరవ స్థానంలో ఉంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో 16 మంది భూమిని ఆక్రమించుకున్నారని తెలిసింది. అయితే స్థలాన్ని పరిశీలించగా 10 మంది పేర్లు వచ్చాయి. ఇందులో శివాలయం కూడా ఉంది, ఆక్రమిత భూమిలో ఆలయం నిర్మించినట్లు తెలుసుకున్నారు. ఇలా స్థలాన్ని ఆక్రమించిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ పది రోజుల గడువు ఇచ్చారు.
శివుడికి నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో ఇది మొదటిసారి కాదు.. అంతకుముందు నవంబర్ 2021లో, జంజ్‌పీర్-చంపా జిల్లా నీటిపారుదల శాఖ కూడా శివుడికి నోటీసు జారీ చేసింది. ఈ వార్త తెరపైకి వచ్చిన తర్వాత కోర్టులో విచారణకు దేవుడెలా హాజరవుతాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో నోటీసు జారీ చేసిన నాయబ్ తహసీల్దార్ విక్రాంత్ సింగ్ ఠాకూర్.. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com