ఒకప్పుడు జీరో.. లాక్‌డౌన్ లక్షాధికారిని చేసింది.. ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నాడంటే?
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడితే ఇతను మాత్రం లక్షాధికారి ఎలా అయ్యాడని అనుకుంటున్నారు. అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే...పై ఫోటోలో కనిపిస్తున్న ఈ గిరిజన యువకుడికి ఒకప్పుడు తినడానికి పూటకి భోజనం లేదు. కానీ ఇప్పుడు నెలకి అక్షరాల అయిదు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ఈ యువకుడి పేరు ముండా.. రోజువారీ కూలీ పని చేసుకొని బ్రతికేవాడు. కరోనా మహమ్మారి వలన ఏర్పడిన లాక్‌డౌన్ వలన ఉపాధిని కోల్పోయాడు. దీనితో అతని కుటుంబం మొత్తం రోడ్డున పడింది.
ఈ క్రమంలో తన స్నేహితుడి ఫోన్‌లో యూట్యూబ్‌లో ఫుడ్ బ్లాగర్ కు సంబంధించిన వీడియోలు చూసేవాడు. అతని లాగే యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు స్మార్ట్‌ఫోన్ కొనే స్థోమత కూడా లేకపోవడంతో అప్పు చేసి కొన్నాడు. ఇక తన మొదటి వీడియోలో తాను తీసుకునే ఆహారం కోసం చేశాడు. ఒక ప్లేట్‌లో అన్నం, పచ్చి టమాటో, పచ్చిమిర్చి కలిపి తింటున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అతని యూట్యూబ్ చానల్‌కు 7 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఇప్పుడు అతడు నెలకు సూమారు 5 లక్షలు పైగా సంపాదిస్తున్నాడు. ఇలా వచ్చిన డబ్బులతో తానూ ఇల్లు కూడా కట్టుకున్నానని ముండా వెల్లడించాడు. అయితే తన లక్షం యూట్యూబ్ వీడియోల నుంచి డబ్బు సంపాదించడం కాదని, తమ స్థానిక సంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని అంటున్నాడు. ప్రస్తుతం ఇతని వీడియోలకి మంచి క్రేజ్ ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com