Bullet Bandi: బుల్లెట్ బండి పాట బామ్మకి కూడా ఊపొచ్చేసింది.. తాతగారి ముందు తడబడకుండా..

Bullet Bandi: ప్రస్తుతం బుల్లెట్ బండి పాటకి, డ్యాన్స్‌కి బోల్డంత క్రేజ్ వచ్చింది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా పాటకి పాదం కదుపుతున్నారు, మండపాల్లో పెళ్లి కూతుళ్లు, హాస్పిటల్‌లో నర్సులు ఒకరేమిటి పాలు తాగే పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ల వరకు పరవసించి పోతున్నారు. డ్యాన్స్ చేస్తూ ఊగిపోతున్నారు.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో 60 ఏళ్లకు పైగా ఉన్న ఓ బామ్మగారు.. బుల్లెట్ బండి పాటకు రిధమ్‌కి తగ్గట్టుగా స్టెప్పులేసి అలరిస్తున్నారు. మంచంలో ఉన్న మగనికి కాస్తైనా ఆరోగ్యం కుదుట పడుతుందేమోనని ఆమె ఆశ కాబోలు.. ఆమె అంతంలా పాట పాడి డ్యాన్స్ చేస్తున్నా ఆయన మాత్రం అలానే కూర్చుని ఉన్నారు. ఏదో సుస్తీ చేసి ఉంటుంది. అయినా బామ్మ తన ప్రయత్నాలేవీ మానుకోకుండా ఇలా పాటలతో, డ్యాన్స్‌తో ఆయనని ఉత్సాహపరుస్తూ, ఆమె కూడా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఏదేమైనా బామ్మగారు బాగా చేస్తున్నారు డ్యాన్స్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నువు సూపర్ బామ్మా అని కొందరంటే.. నీ డ్యాన్స్ చూసి తాతగారు కూడా మెల్లగా కోలుకుంటార్లే బామ్మ అని మరొకరు, నీ ప్రయత్నానికి హాట్సాఫ్ బామ్మా అని మరికొందరు బామ్మగారిని అభినందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com