Viral News: అందమైన ప్రేమ కథ.. హౌస్ కీపర్‌ను పెళ్లాడిన లేడీ డాక్టర్..
Viral News: ప్రేమ.. ఎప్పుడు కలుగుతుందో, ఎవరిమీద కలుగుతుందో ఎవరు చెప్పగలరు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది.. హఠాత్తుగా కలిగేదే కదా ప్రేమంటే.. అందుకే ఆమె డాక్టర్ అయినా తన స్థాయికి తగ్గవాడిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. తన మనసుకు నచ్చిన వాడిని మనువాడింది.. హౌస్ కీపర్ అని తెలిసినా ప్రేమకు అవన్నీ తెలియవని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లాడింది.
పాకిస్థానీ వైద్యురాలు ఆమెతో పాటు అదే ఆసుపత్రిలో పనిచేసే హౌస్ కీపర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. అదే ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ స్టాఫ్ మెంబర్ షాజాద్‌కు తాను ప్రపోజ్ చేసినట్లు డాక్టర్ కిశ్వర్ సాహిబా తెలిపారు.
మేరా పాకిస్థాన్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ జంట తమ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడారు. వారు పంజాబ్‌లోని ఒకారా తహసీల్‌లోని దీపల్‌పూర్‌లో నివసిస్తున్నారు. వారి సామాజిక పరిస్థితుల కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.
షాజాద్‌కు డాక్టర్ చాలా అందంగా కనిపించగా, షాజాద్ అభిమానానికి తాను పడిపోయానని కిశ్వర్ వెల్లడించారు. కిశ్వర్ ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. అదే ఆసుపత్రిలో, షాజాద్ వార్డులను శుభ్రం చేసి, టీ వడ్డించేవాడు.
ఒక రోజు, కిష్వర్ అతని ఫోన్ నంబర్ అడిగాడు మరియు జంట క్రమం తప్పకుండా మాట్లాడటం ప్రారంభించారు. షాజాద్ తన వాట్సాప్ స్టేటస్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. కిశ్వర్ దానిని చూసి లైక్ చేసారు. ఆ రోజు తర్వాత నుంచి వాళ్లిద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఓ ఫైన్ మార్నింగ్ ఆమె అతనికి ప్రపోజ్ చేసింది.
షాజాద్ ఈ ప్రతిపాదనతో చాలా షాక్ అయ్యాడు. బాడీ అంతా షివరింగ్ వచ్చినట్లైంది. షాజాద్‌ను మొదటిసారి కలిసినప్పుడు అతను క్లీనర్‌గా లేదా చాయ్‌వాలాగా కనిపించలేదని పాకిస్థానీ వైద్యురాలు వివరించింది. షాజాద్‌ను వివాహం చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదనుకుని ఆమె అతనికి ప్రపోజ్ చేసింది.
పాకిస్తాన్‌లోని ప్రజలు ఆర్థికంగా సరితూగే వారినే వివాహం చేసుకుంటారని కిష్వర్ పేర్కొన్నాడు. అయినప్పటికీ తాను షాజాద్‌ను వివాహం చేసుకున్నానని తెలిపింది. పెళ్లి తర్వాత కుటుంబసభ్యులు ఆమెను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆమె తన ఉద్యోగాన్ని వదిలివేసింది.
ఆమె సహోద్యోగులు కూడా ఆమెను ఎగతాళి చేశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా తాను షాజాద్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని వివరించింది డాక్టర్ కిష్వర్.. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి సొంతంగా క్లినిక్ పెట్టుకునే పనిలో ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com