వామ్మో అదేం పని.. విమానంలో పిల్లికి చనుబాలిస్తున్న మహిళ.. ప్రయాణీకులు షాక్

వామ్మో అదేం పని.. విమానంలో పిల్లికి చనుబాలిస్తున్న మహిళ.. ప్రయాణీకులు షాక్
పిల్లల కంటే కూడా పిల్లుల్ని, కుక్కల్ని ప్రేమగా పెంచుకునే వాళ్లను చూశాం కానీ.. మరీ తన చనుబాలు ఇచ్చేంత ప్రేమని ఎక్కడా చూడలేదు బాబు.

పిల్లల కంటే కూడా పిల్లుల్ని, కుక్కల్ని ప్రేమగా పెంచుకునే వాళ్లను చూశాం కానీ.. మరీ తన చనుబాలు ఇచ్చేంత ప్రేమని ఎక్కడా చూడలేదు బాబు.. నీ ప్రేమ తగలెయ్య అని ప్రయాణీకులు ఆ దృశ్యాన్ని చూడలేక ఎయిర్ హోస్ట్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లు వచ్చి ఇదేం పని అని మందలించినా తన పని తాను చేసుకునే సరికి వాళ్లకి చిర్రెత్తుకొచ్చింది.

డెల్టా ఎయిర్ ఫ్లైట్ DL1360 నుండి USAలోని అట్లాంటాకు వెళ్లే ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్‌లో ఈ వింత పరిణామం చోటుచేసుకుంది. సిబ్బంది పిల్లిని క్యారియర్‌లో ఉంచమని అభ్యర్థించినా మహిళ నిరాకరించింది.

దాంతో సిబ్బందికి ఏం చేయాలో పాలుపోలేదు. ఎయిర్‌క్రాప్ట్ కమ్యూనికేషన్స్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా గ్రౌండ్‌కు మెసేజ్ పంపించారు. విమానంలో ఓ మహిళ చేస్తున్న పని అభ్యంతరకరంగా ఉంది అని మెసేజ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story