వైరల్

Florida: పైలట్‌కు అస్వస్థత.. ప్రయాణికుడే పైలట్‌గా మారి..

Florida: ఇటీవల ఫ్లోరిడాలో విమానం నడుపుతుండగా పైలెట్ అస్వస్థకు గురయ్యాడు. ఆ విషయాన్ని ప్రయాణికుడు అధికారికి తెలియజేశాడు.

Florida: పైలట్‌కు అస్వస్థత.. ప్రయాణికుడే పైలట్‌గా మారి..
X

Florida: విమాన ప్రయాణం అంటే చాలా ప్రమాదకరమని ఇప్పటికీ చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే విమానాలకు ఏదైనా ప్రమాదం జరిగితే.. అందులో నుండి బయటపడేవారి సంఖ్యకంటే మరణించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కానీ మొదటిసారి ఏ అనుభవం లేని ఓ ప్రయాణికుడు పైలెట్‌గా మారి తన ప్రాణాలనే కాకుండా తనతో ఉన్నవారి ప్రాణాలను కూడా రక్షించాడు.

ఇటీవల ఫ్లోరిడాలో విమానం నడుపుతుండగా పైలెట్ అస్వస్థకు గురయ్యాడు. అదే విషయాన్ని అందులోని ప్రయాణికుడు డ్యారెన్ హారిసన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలియజేశాడు. ఆ సమయంలో డ్యారెన్‌తో పాటు మరో ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడు. అందుకే డ్యారిన్‌కు విమానం ఎలా నడపాలో ఐడియా ఉందా అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబర్ట్ మార్గన్ అడిగాడు. కానీ తనకు అసలు ఏమీ తెలియదని చెప్పేశాడు డ్యారిన్.

అయినా ఈ సందర్భంలో డ్యారిన్, రాబర్ట్.. ఇద్దరూ భయపడకుండా చాకచక్యంగా ఆలోచించారు. విమానంలోని కంట్రోల్స్ అన్నీ రాబర్ట్ చెప్తుంటే డ్యారిన్ ఆపరేట్ చేశాడు. అలా డ్యారిన్ జాగ్రత్తగా ఫ్లోరిడాలో ఆ విమానాన్ని ల్యాండ్ చేశాడు. అంత సీరియస్ సందర్భంలో కూడా ప్రయాణికుడి ధైర్యసాహసాను అందరూ మెచ్చుకుంటారు. అంతే కాకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబర్ట్‌ను కూడా ప్రశంసిస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES