Viral Video: మాస్క్ లేదని.. ట్రైన్‎లో నుంచి తోసేసిన ప్యాసింజర్లు..ఆ తర్వాత

Not Wearing Mask

Image Source On Twitter

Passengers throw a Guy with out mask: ప్రాణాంతక వైరస్‎ని ఎదుర్కొవాలంటే మాస్క్ తప్పనిసరి అని ప్రపంచ దేశాలన్ని పదేపదే హెచ్చరిస్తున్నాయి.

Passengers throw a Guy with out mask: ప్రాణాంతక వైరస్‎ని ఎదుర్కొవాలంటే మాస్క్ తప్పనిసరి అని ప్రపంచ దేశాలన్ని పదేపదే హెచ్చరిస్తున్నాయి. మాస్క్ ఉంటే కరోనా సోకకుండా అడ్డుకొవచ్చు. అయితే కొందరూ మాత్రం మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ లేకుండా ట్రైన్ ఎక్కిన ఓ యువకుడ్ని బలవంతంగా ట్రైన్ నుంచి బయటకు నెట్టేశారు తొటి ప్రయాణీకులు. ఈ ఘటన స్పెయిన్‌లో జరిగింది. ట్విట్టర్‌లో ఓ వీడియో ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ యువకుడు మాస్క్ ధరించకుండ ట్రైన్ ఎక్కాడు. రైలులో ఉన్న ఓ యువతి... మాస్క్ పెట్టుకోమని సూచించింది. కానీ అతను వినిపించుకోలేదు. దాంతో ఆ యువతి వాదనకు దిగింది. మాస్క్ పెట్టుకుంటావా లేదా అంటూ గట్టిగా అరిచింది. దాంతో ఆ యువకుడు వాదనకు దిగాడు. దీంతో ఆమె రైలు దిగిపోవాలని హెచ్చరించింది. ఆ యువతికి మిగతా ప్యాసింజర్లు కూడా మద్దతుగా నిలిచారు. ఆ యువకుడు రైలు దిగేది లేదని పట్టుపట్టడంతో... అందరూ కలిసి అతన్ని రైల్లోంచీ బయటకు నెట్టేశారు. అప్పటికీ రైలు ఇంకా కదల్లేదు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెకు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. గత నెల నుంచి స్పెయిన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్క్ లేకుండా ఇళ్లలోంచి బయటకు రావొద్దని హెచ్చరింస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story