Karimnagar: నర్సుల వెరైటీ ట్రీట్‌మెంట్.. లేచి కూర్చున్న కోమా పేషెంట్..

Karimnagar: అపస్మారక స్థితిలో ఉన్న ఓ పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు నర్సులు వినూత్న ప్రయత్నం చేశారు. సినిమా పాటల ద్వారా ఆ పేషెంట్లో కదలికలు తెప్పించే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన శ్రీనివాస్... లివర్ సంబంధిత వ్యాధితో బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందక అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నెలకిందట అతన్ని కరీంనగర్ మీనాక్షి హాస్పిటల్‌లో చేర్పించారు.
డాక్టర్లు, నర్సుల ప్రయత్నాలతో శ్రీనివాస్ ఈమధ్యే కళ్లు తెరవడం, కాళ్లు కదపడం చేస్తున్నాడు. చేతుల్లోనూ కదలిక రావాలన్న ఉద్దేశంతో నర్సులు ఇలా వినూత్న ప్రయత్నం చేశారు. నర్సుల ఆటపాటలతో శ్రీనివాస్‌లో కొంతమేర కదలికలు మొదలయ్యాయి. దీంతో అతన్ని ICU నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com