parrot missing : పాపం చిలుక ఎగిరిపోయిందట.. పట్టిస్తే నజరానా.. !
parrot missing : గత 12 ఏళ్లుగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు చిలుక తప్పిపోవడంతో ఓ కుటుంబం దానికి కోసం అలమటిస్తోంది...
BY vamshikrishna6 May 2022 11:45 AM GMT

X
vamshikrishna6 May 2022 11:45 AM GMT
parrot missing : గత 12 ఏళ్లుగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు చిలుక తప్పిపోవడంతో ఓ కుటుంబం దానికి కోసం అలమటిస్తోంది... ఇంతకీ ఇది ఎక్కడంటే బిహార్ లోని గయాలో .. గయాకు చెందిన శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, ఆయన భార్య సంగీత గుప్తా ఓ చిలుకను పెంచుకుంటున్నారు.
చిలుకకు పోపో అని ముద్దుగా పేరు కూడా పెట్టారు. దానిని ఓ పెంపుడు చిలుకు లాగా కాకుండా ఇంట్లో మనిషిలో చూసుకుంటున్నారు.. అయితే ఆ చిలుక నెల రోజుల క్రితం ఇంటి నుంచి ఎగిరిపోయిందని, దానికోసం వెతుకులాట కూడా ప్రారంభించారు. చివరికి రోడ్డు పైన పోస్టర్లు కూడా అంటించారు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. చిలుక ఆచూకి చెబితే రూ.5,100 నజరానా ఇస్తామని ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story