Philippines: భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లలేకపోయిన భర్త.. అందుకే ఇలా..

Philippines: భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లలేకపోయిన భర్త.. అందుకే ఇలా..
Philippines: ఫిలిప్పిన్స్‌కు చెందిన రేమండ్ ఫార్టునాడో.. తన భార్య జోవానాతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు.

Philippines: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళితే ఆ మజానే వేరు. కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల్లో ఎంతమంది అలా వెకేషన్లకు వెళ్లగలుగుతున్నారు..? అందుకే భార్య తనతో వెకేషన్‌కు రాకపోయినా.. భర్త ఓ సూపర్ ప్లాన్ వేశాడు. ఆ భర్త ప్లాన్‌కు నెటిజన్లంతా ఫిదా అయిపోతున్నారు. నెట్టింట్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడు అనుకుంటున్నారా..

ఫిలిప్పిన్స్‌కు చెందిన రేమండ్ ఫార్టునాడో.. తన భార్య జోవానాతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు. కానీ అనుకోకుండా తన జోవానాకు ఆఫీస్ వర్క్ ఉండేసరికి వెకేషన్ క్యాన్సిల్ అవ్వాల్సింది. కానీ రేమండ్ అలా అవ్వనివ్వలేదు. తన భార్య మొహంతో ఓ దిండు తయారు చేయించి దానితో తన వెకేషన్‌ను పూర్తి చేశాడు.

రేమండ్ వెళ్లిన ప్రతీ చోటికి ఆ దిండును కూడా తీసుకెళ్లాడు. దానితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పెట్టి చాలారోజులు అయినా ఇప్పటికీ ఇది నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story