మూగజీవాలని కూడా చూడలేదు.. విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి..!

మూగజీవాలని కూడా చూడలేదు.. విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి..!
వానరుల పై విశ్వరూపం ప్రదర్శించారు కొందరు వ్యక్తులు.. మానవత్వం మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

వానరుల పై విశ్వరూపం ప్రదర్శించారు కొందరు వ్యక్తులు.. మానవత్వం మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లాలో వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఇందులో 30కోతులు చనిపోయాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచులు మూటలను గుర్తించారు. వాటిని విప్పి చూడగా అందులో కోతులు కనిపించాయి. అందులో కొన్ని కోతులు మరణించగా, మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాయి. దీనితో ఆ యువకులు గాయపడిన కోతులను బయటకు తీసి వాటికి నీరును అందించారు. అయితే దీనిపైన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి.. కోతులకి విషం పెట్టి బాగా కొట్టారని అనుమానిస్తున్నారు. మరణించిన వానరాలకు పోస్టుమార్టం నిర్వహించగా, విషం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోని నటుడు రణ్‌దీప్‌ హుడా షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story