పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. కట్నాలు డైరెక్ట్ గా అకౌంట్‌లోకే

X
By - TV5 Digital Team |18 Jan 2021 5:12 PM IST
తాజాగా తమిళనాడులోని మధురైలో ఓ పెళ్లి జంట వైరటీగా పెళ్లి పత్రిక పైన క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌లను ఆ పత్రిపై ప్రింట్ చేశారు.
ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపొయింది. ఏం కొన్నా, ఎవరికీ మనీ పంపాలన్నా.. అంతా ఫోన్ నుంచే క్షణాలలో జరిగిపోతున్నాయి. అయితే తాజాగా తమిళనాడులోని మధురైలో ఓ పెళ్లి జంట వైరటీగా పెళ్లి పత్రిక పైన క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌లను ఆ పత్రిపై ప్రింట్ చేశారు. పెళ్ళికి వచ్చిన వారు, కరోనాకి భయపడి రానివారు గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే వీలును కల్పించారు. అయితే దీనిని పెళ్ళికి వచ్చిన ముప్పై మంది మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా వివాహం ఆదివారం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com