viral video: హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ.. సూట్ ధరించి పానీపురి అమ్ముతూ..

viral video: హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ.. సూట్ ధరించి పానీపురి అమ్ముతూ..
X
viral video: సూట్ అంటే బిజినెస్ మీటింగ్‌లో మాత్రమే ధరించాలని ఎవరు చెప్పారు? సూట్లు ధరించి మేము మా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాము..

viral video: పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేముంది. మనకి ఇష్టమైన పని చేస్తే అందులో ఆనందం ఉంటుందంటారు పంజాబ్ కు చెందిన ఆ ఇద్దరు సోదరులు. బిజినెస్ సూట్ ధరించిన ఆ ఇద్దరు సోదరులు మొహాలీలో రోడ్డు పక్కన తినుబండారాల స్టాల్ ని నడుపుతున్నారు. అక్కడ వారు చాట్, గోల్గప్పా, దహీ భల్లా, భేల్ పురి లాంటి వాటిని విక్రయిస్తారు.

సూట్ అంటే బిజినెస్ మీటింగ్‌లో మాత్రమే ధరించాలని ఎవరు చెప్పారు? సూట్లు ధరించి మేము మా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాము.. కస్టమర్లందరూ తమకు చాలా రెస్పెక్ట్ ఇస్తారని చెప్పారు. మన డ్రెస్సింగ్ సెన్స్ మన గౌరవాన్ని పెంచుతుంది.. అలా అని సూట్ వేసుకోని వాళ్లందరని తక్కువ అంచనా వేయట్లేదు. ఏ పని చేసేటప్పుడైనా డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యం అని చెబుతారు సోదరులిరువురు.

ఇటీవల, ఓ యూట్యూబర్ హ్యారీ ఉప్పల్ వారి ఛాట్ భండార్ ని సందర్శించి, వారి ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసారు అది వైరల్ అయ్యింది. యూట్యూబర్ ఓ కస్టమర్లా ఆ దుకాణానికి వెళ్లి సూట్ ఎందుకు ధరించారు అని అడిగాడు. దాంతో సోదరులు ఇరువురూ "యే బాస్ హోటల్ మేనేజ్‌మెంట్ కా సైన్ హై. నేను హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని చేశాను. ప్రజలు మా గురించి మరింత తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. బాగా చదువుకుని మంచి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకూడదు.. ఏ ఫ్రొఫెషన్ కి అయినా స్థాయి, అంతరాలు ఏవీ వుండవు.. ఇష్టంతో పని చేయాలి. అందులో విజయం సాధించాలి అని అంటున్నారు ఈ అన్నదమ్ములు.

యూట్యూబర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు వారి అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, "ఈ యంగ్ చెఫ్‌లు మిలియనీర్లు అయ్యే మార్గంలో ఉన్నారు.. వారి దుస్తుల కోడ్ వారిని మరింత ప్రొఫెషనల్‌గా చేస్తుంది. మరికొంత మంది యువకులు వీరి నుండి నేర్చుకుంటారు!!" అని రాస్తున్నారు.

మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, "హ్యాట్స్ ఆఫ్ గై మీరు తప్పకుండా యువకులకు స్ఫూర్తిగా నిలుస్తారు. త్వరలో మీరు గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని రాశారు. హార్డ్ వర్క్ కి తోడు ప్రొఫెషనలిజమ్ తోడైతే రిజల్ట్ అద్భుతంగా ఉంటుందని మరొకరు వ్యాఖ్యానించారు.

Tags

Next Story