Pushpa Movie: 'పుష్ప' కొరియన్ వర్షన్‌లో అల్లు అర్జున్‌ను చూశారా..? వీడియో వైరల్..

Pushpa Movie: పుష్ప కొరియన్ వర్షన్‌లో అల్లు అర్జున్‌ను చూశారా..? వీడియో వైరల్..
X
Pushpa Movie: పుష్ప నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండో పాట ‘శ్రీవల్లి’.

Pushpa Movie: 'పుష్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండు నెలలు అవుతోంది. కానీ ఇంకా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ మూవీ పాటలు, తగ్గేదే లే అన్న డైలాగు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో, దేశాల్లోనే పుష్ప ఫీవర్ ఎక్కువగా ఉంది. తాజాగా ఈ క్రేజ్ కొరియా వరకు వెళ్లిపోయింది.

పుష్ప నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండో పాట 'శ్రీవల్లి'. ఈ సినిమా లిరికల్ వీడియో విడుదదల అయినప్పుడే అల్లు అర్జున్ వేసిన స్టెప్‌కు కొందరు ఫ్యాన్స్ అయిపోయారు. కానీ చాలామంది మాత్రం అల్లు అర్జున్ లుక్స్‌ను, స్టెప్‌ను ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే స్టెప్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఈ స్టెప్ ట్రై చేయని వారు ఎవరూ ఉండరేమో అనిపిస్తోంది.

ఇటీవల ఓ కొరియన్ అమ్మాయి అచ్చం పుష్పలో అల్లు అర్జున్‌లాగా రెడీ అయ్యి శ్రీవల్లి స్టెప్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చూడడానికే కాదు.. స్టెప్ కూడా క్యూట్‌గా వేయడంతో తన వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కొద్ది గంటల్లోనే దానికి మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. 'ఈ డ్యాన్స్ మీరు అనుకుంటున్నదాని కంటే చాలా కష్టం. కొరియన్ వర్షన్‌లో అల్లు అర్జున్' అంటూ క్యాప్షన్ పెట్టింది. కొరియన్ వర్షన్‌లో ఈ అల్లు అర్జున్‌ను చూసి నెటిజన్లు లైకులు, కామెంట్లు కురిపిస్తున్నారు.

Tags

Next Story