Taj Mahal: ఈతరం షాజహాన్.. మూడేళ్లు కష్టపడి భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు..

Taj Mahal (tv5news.in)
Taj Mahal: తాజ్ మహల్.. దీన్ని కట్టి ఎన్నో వందల సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా ఈ కట్టడాన్నే ప్రేమకు చిహ్నంగా గుర్తిస్తారు ప్రేమికులు. షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ఈ కట్టడం చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీదు కానీ తాజ్ మహల్ మాత్రం ఎప్పటికీ చాలామంది మనసులో నిలిచిపోయే ఓ జ్ఞాపకం. అలాంటి ఓ జ్ఞాపకాన్నే నిర్మించుకున్నాడు మధ్య ప్రదేశ్‌లోని ఓ వ్యక్తి.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో అచ్చం తాజ్ మహల్ లాంటి ఓ కట్టడం స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. షాజహాన్ భార్య ముంతాజ్ బుర్హాన్‌పూర్‌లోని మరణించిందని చరిత్ర చెప్తుంది. ముందుగా తాజ్ మహాల్‌ను తిప్తి నది ఒడ్డున కట్టాలని సన్నాహాలు జరిగాయట. కానీ తర్వాత అది ఆగ్రాలో నిర్మించబడింది. కానీ తాజ్ మహల్ బుర్హాన్‌పూర్‌లో బాగుంటుందన్న ఆలోచన వచ్చింది అక్కడ ఓ స్థానికుడికి.
ఆలోచన వచ్చిందో లేదో.. అంతే తాజ్ మహల్ లాగే ఉండే భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇదంతా పూర్తి చేయడానికి అతడికి మూడేళ్లు పట్టినా.. ఆ కట్టడం మాత్రం అచ్చం తాజ్ మహాల్‌ను తలపించేలా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానికోసం అతడు చాలానే కష్టపడ్డాడు. ఒరిజినల్ తాజ్ మహాల్‌ను చాలా దగ్గర నుండి స్టడీ చేశాడు.
అనుభవం ఉన్న ఇంజనీర్లను పిలిపించి ఈ తాజ్ మహల్ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. బెంగాళ్, ఇండోర్‌లో ఉండే పెద్ద పెద్ద ఇంజనీర్లను కలిశాడు. ఆ ఇంటికి కావాల్సిన ప్రతీ అంశాన్ని చాలా దగ్గర ఉండి చూసుకున్నాడు. తాజ్ మహాల్ లాంటి స్తంభాలతో సహా అన్ని అచ్చం తాజ్ మహల్ లాగానే ఉండేలా చూసుకున్నాడు. మూడేళ్లకు అతడి కలల తాజ్ మహాల్ సిద్ధమయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com