Viral Video: సందర్శకుల బస్సును చుట్టుముట్టిన బెంగాల్ టైగర్స్..ఆ తర్వాత ఏమైందంటే

మీకై మీరు నేరుగా పులిబోనులోకి వెళ్తే ఎలా ఉంటుంది. పోనీ పెద్దపులి ఒకటి మీ ఎదురుగా ఉంటే.. అది కూడా మీ ముఖం ముందు నిలబడి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అయ్యా బాబోయ్.. ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుందా?. ఓ జూలో సందర్శకులకు కూడా ఇలాంటి అనుభూతే కలిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్క్.. బంగ్లాదేశ్‌లోని బంగాబందు నేషనల్ టైగర్ సఫారి పార్క్. అక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. పార్క్ వచ్చిన సందర్శకులు బస్సులో ప్రయాణం చేస్తూ పార్క్ మొత్తం కలయతిరిగారు. ఈ క్రమంలో బెంగాల్ టైగర్స్ జోన్ దగ్గరకు చేరుకున్న తర్వాత అక్కడ బస్సు కొంత సమయం నిలిపివేశారు. అక్కడే ఉన్న మూడు టైగర్స్ ఒక్కొక్కటిగా బస్సు వద్దకు చేరుకున్నాయి.
మూడు పెద్దపులులు ఎక్కడ దాడి చేస్తాయో అని ప్రయాణీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ పులులను దగ్గర నుంచి చూశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే నేను జూ సంస్కృతికి వ్యతిరేకిస్తున్నా.. మనిషి జంతువుల మధ్యలో కాదు బోనులో ఉండాలి. అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే బెంగాల్ టైగర్స్ దగ్గరకు రాగానే బస్సులో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉందో చూడాలి. అంటూ కామెంట్ చేశాడు. ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూడండి.
Bangabandhu National Tiger Safari Park in Bangladesh - The world's biggest. Just see the huge size of the Royal Bengal Tigers pic.twitter.com/7h7gcT1ALP
— Kaptan Hindustan™ (@KaptanHindostan) July 14, 2021
Also Read: చికట్లో వింత ఆకారం..ఏలియన్‌గా భావించిన నెటిజన్స్..తీరా చూస్తే
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com