ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్ ను వేధించిన వ్యక్తి.. వీడియో వైరల్

ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్ ను వేధించిన వ్యక్తి.. వీడియో వైరల్
ఆకతాయిల ఆగడాలకు హద్దేముంటుంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు, ఒంట్లో నెత్తురు ఉరకలేస్తుందేమో..

ఆకతాయిల ఆగడాలకు హద్దేముంటుంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు, ఒంట్లో నెత్తురు ఉరకలేస్తుందేమో.. విధుల్లో భాగంగా ఎంతో మందితో మాట్లాడాల్సి వస్తుంది. అందరూ ఒకే విధంగా ఉండరు. పనీ పాటా లేని వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకుండా ఉంటేనే పని చేసుకోగలుగుతారు. అదే చేసింది రష్యన్ యూట్యూబర్.

ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న రష్యన్ యూట్యూబర్ 'కోకో ఇన్ ఇండియా'ను ఓ వ్యక్తి వేధించాడు. ఢిల్లీలోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్‌లో రష్యాకు చెందిన ఓ యూట్యూబర్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న తరుణంలో వేధింపులకు గురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగాడు. అతడి ప్రశ్నకు అవాక్కయిన ఆమె కొంత అసహనానికి గురైంది.

మాటల మధ్యలో అతను ఒక రష్యన్ అమ్మాయితో స్నేహం చేయడం తన కల అని చెప్పాడు. మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి యూట్యూబర్ ను మరింత ఇబ్బందికి గురి చేశాడు. “మీరు చాలా సెక్సీగా ఉన్నారు. మీరు నా ఫ్రండ్ గా ఉంటే చాలా బావుంటుంది అని అన్నాడు. "

ఈ వీడియో కోకో యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన ఆమె ఫాలోవర్స్ కు కోపం తెప్పించింది."ఒక భారతీయుడిగా, ఆ కుర్రాడి ప్రవర్తనకు నేను క్షమాపణలు కోరుతున్నాను," అని ఒక యూట్యూబ్ వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరొక వ్యక్తి "భారతీయుడిగా, అలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నందుకు నేను చింతిస్తున్నాను. అలాగే , మీ ధైర్యసాహసాలకు, మీరు ఆ వ్యక్తిని పట్టించుకోని విధానానికి నేను నమస్కరిస్తున్నాను." అని రాశారు.

Tags

Read MoreRead Less
Next Story