అమెరికా అధ్యక్షుడికి ఇండియా కళాకారుడి విషెస్

అమెరికా అధ్యక్షుడికి ఇండియా కళాకారుడి విషెస్

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలపై ఇండియాలో ఆసక్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తయారు చేసిన సైకత శిల్పం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. అమెరికా అధ్యక్ష అభ్యర్ధులైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇసుకతో తయారు చేసిన శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. పూరి గోల్డెన్ బీచ్ లో అమెరికా జాతీయ జెండాతో పాటు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల రూపాలను పొందుపరిచారు. ఇందుకోసం 5 టన్నుల ఇసుకను వాడినట్లు సుదర్శన్‌ పట్నాయక్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story