Sara Tendulkar: సారా కొత్త వ్యాపారం.. రేటు చూస్తే కళ్లు బైర్లు కమ్మినట్లే!

Sara Tendulkar: సారా కొత్త వ్యాపారం.. రేటు చూస్తే కళ్లు బైర్లు కమ్మినట్లే!
వ్యాపారవేత్తగా మారిన సచిన్ తనయ, సరికొత్త డైరీలకు శ్రీకారం చుట్టిన సారా, రేట్లు చూసి వాపోతున్న నెటిజన్లు

Sara Tendulkar: నిన్నమొన్నటివరకూ సచిన్ తనయగానే అందరికీ పరిచయం అయిన సారా క్రమంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరుగాంచిన సారా మోడల్ గానూ రాణిస్తోంది. తాజాగా వ్యాపారవేత్తగా మారింది ఈ బ్యూటీ. కొత్త సంవత్సరాది పురస్కరించుకుని ఓ విభిన్నమైన ఆలోచనతో ముందుకు వచ్చిందట. ఆ ముచ్చటేంటో చూద్దాం.


సారాను దగ్గర నుంచి పరిశీలించిన వారు ఆమె చుట్టుపక్కల పుస్తకాలు ఉండటం గమనించే ఉంటారు. డైరీ లేదా నోట్ బుక్ లో ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటుందని సన్నిహితులు సైతం చెబుతారు. అయితే ఆమె ఈ ఇంట్రెస్ట్ నే నలుగురికీ పరిచయం చేయాలనుకుంటోందట. కస్టమైజ్డ్ డైలీ ప్లానర్ పేరిట నూతన సంవత్సరం అంటే 2023 కోసం ఓ ప్రత్యేకమైన డైరీని రూపొందించింది. ఈ డైరీలో తాము రోజు చేయాలనుకునే పనులను ఎంటర్ చేయడంతో పాటూ వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే విధంగానూ ప్రోత్సహిస్తుంది. డైరీలో ఫీచర్లు బాగానే ఉన్నప్పటికీ దాని ధరే కళ్లుబైర్లు కమ్మేట్లు ఉందంటున్నారు నెటిజన్లు.


సాధారణంగా కొత్త సంవత్సరం డైరీలు మార్కెట్ లో రూ.100 నుంచి రూ.150 రూపాయిలకే దొరుకుతాయి. కానీ, సారా కస్టమైజ్డ్ డైరీ రూ. 2,500 ఉండటంతో ఒక్కసారిగా జనాలు ఖంగుతిన్నారు. ఈ డైరీ కేవలం సంపన్నులకు మాత్రమేనంటూ కొందరు వాపోతుంటే, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మరో డైరీ తీసుకురావాలని మరికొందరు సూచిస్తున్నారు. మరి సారా ఈ విషయం కాస్త దృష్టిలో పెట్టుకుంటుందేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story