Viral News: సెలవుల్లో నిన్ను మిస్సవుతున్నా.. మైనర్ విద్యార్థికి టీచర్ 'ప్రేమలేఖ'

Viral News: సెలవుల్లో నిన్ను మిస్సవుతున్నా.. మైనర్ విద్యార్థికి టీచర్ ప్రేమలేఖ
Viral News: మాష్టార్లు ఎందుకిలా మారిపోతున్నారు.. వయసు తారతమ్యం లేకుండా ప్రేమ దోమ అంటూ వెంట పడుతూ విద్యార్థినులను వేధిస్తున్నారు..

Viral News: మాష్టార్లు ఎందుకిలా మారిపోతున్నారు.. వయసు తారతమ్యం లేకుండా ప్రేమ దోమ అంటూ వెంట పడుతూ విద్యార్థినులను వేధిస్తున్నారు.. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పిల్లల చేత ప్రేమ పాఠాలు వల్లె వేయిస్తున్నాడు.. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


విద్యార్థినిని తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఆమెను చాలా ప్రేమిస్తున్నానని ఉపాధ్యాయుడు హరిఓమ్ సింగ్ లేఖలో పేర్కొన్నాడు. శీతాకాలపు సెలవుల్లో ఆమెను మిస్ అవుతున్నానని కూడా లెటర్‌లో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ విద్యార్థికి ఆమెపై తన ప్రేమను తెలుపుతూ లేఖ రాశాడు. 47 ఏళ్ల టీచర్ 13 ఏళ్ల 8వ తరగతి విద్యార్థినికి రాసిన ఒక పేజీ ప్రేమలేఖ చదివిన తర్వాత చింపివేయాలని, ఎవరికీ చూపించవద్దని విద్యార్థిని కోరాడు. విద్యార్థిని తన తల్లిదండ్రులకు లేఖను చూపించింది. తరగతి ఉపాధ్యాయుడు తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.




విద్యార్థినిని తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఆమెను చాలా ప్రేమిస్తున్నానని ఉపాధ్యాయుడు హరిఓమ్ సింగ్ లేఖలో పేర్కొన్నాడు. వీలైనప్పుడు తనకు ఫోన్ చేయమని కూడా అతను కోరినట్లు సమాచారం. విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి, ఇటువంటి చర్యలకు పాల్పడినందుకు క్షమాపణ చెప్పాలని కోరాడు. కానీ ఉపాధ్యాయుడు అందుకు అంగీకరించకపోగా, అనంతరం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తానని తల్లిదండ్రులను బెదిరించాడు. జిల్లా ప్రాథమిక విద్యా అధికారి కౌస్తుభ్ సింగ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు, ఆరోపణలు నిజమని తేలితే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోందని అధ్యక్షుడు అనుప్ మిశ్రా తెలిపారు.

Tags

Next Story