Selena Gomez : మరోసారి ప్రేమలో పడ్డ పాప్ సింగర్

ప్రముఖ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ కొత్త కుర్రాడితో చెట్టాపట్టాల్ వేసేస్తోందిట. చైన్ స్మోకర్స్ ఫేమ్ డ్రూ టగ్గర్ట్ తో అమ్మడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని తెలుస్తోంది. యూఎస్ వీక్లీ రిపోర్ట్ అనే వెబ్ మ్యాగజైన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
గతంలో సిలీనా చాలామందతో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాపులర్ బాయ్ ఫ్రెండ్స్ లో జస్టిన్ బీబర్‌తో చాలా కాలం పాటు అంటే 2011 నుంచి 2018 వరకు ప్రేమాయణం సాగించింది. అప్పట్లో ఇరువురూ ఎన్నోసార్లు వార్తలకెక్కారు. 2018లో జస్టిన్ తో బ్రేక్‌అప్ అయిన తరువాత డిప్రెషన్ లోకి వెళ్లి తిరిగి కుదురుకుంది.
అయితే జస్టిన్ కన్నా ముందు... 2008లో సిలీనా నిక్ జొనాస్ తో ప్రేమలో మునిగితేలింది. అప్పుట్లో ఇరువురూ డిస్నీ ఛానల్ స్టార్స్ గా వెలుగొందుతున్నారు. 2009లో కూడా ఈ భామ టేలర్ ల్యూట్నిర్ ప్రేమలో పడగా ఆ రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఏమైనా తాజా బాయ్ ఫ్రెండ్ తో అయినా అమ్మడు పెళ్లి ముచ్చట చెబుతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com