Viral Video: ఇంటి ముందు తిరిగిన వింత ఆకారం..సీసీటీవీకి చిక్కిన నీడ..

Viral Video: భూతాలు, దెయ్యాలు ఉన్నాయని నమ్మేవారు కొందరైతే.. లేవని కొట్టిపారేస్తుంటారు మరికొందరూ. సోషల్ మీడియాలో వీటి గురించి ఎన్ని వార్తలు వచ్చిన చూస్తుంటారు నెటిజన్లు. అయితే ఇప్పుడు నెటింట్లో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. స్కాట్‌ల్యాండ్‌లో ఇంటి బయట ఓ నల్లటి నీడ అకస్మాత్తుగా ప్రత్యక్షమై.. అక్కడే ఉన్న కారవాన్‌లోకి దూరడం.. ఆ ఇంటి యజమానిని భయాందోళనకు గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్కాట్‌ల్యాండ్‌లోని బారోఫీల్డ్‌లో నివాసం ఉంటున్న మాక్సిన్ హ్యూస్ అనే ఓ మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి ఖంగుతింది. ఓ నల్లటి నీడలాంటి ఆకారం గాల్లో ఎగురుకుంటూ అక్కడే గార్డన్‌లో పార్క్ చేసిన కారవాన్‌లోకి దూరటం కనిపించింది. దీంతో మాక్సిన్ తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే ఆమె ఇంటి చుట్టూ వింత వింత ఆకారాలు తిరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి నల్లటి ఆకారాలను చూసినట్లుగా మాక్సిన్ చెప్పింది. గతంలో తన పిల్లలు బయట ఆడకుంటున్న సందర్భంలో నల్లటి నీడ వారి చూట్టూ తిరిగేదని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com