సైనికుడికి సెల్యూట్.. తన కాళ్లపై పడుతుంటే.. !

సైనికుడికి సెల్యూట్.. తన కాళ్లపై పడుతుంటే.. !
సోషల్‌ మీడియాలో ఓ వీడియో వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. సెలబ్రెటీలు అంతా ఈ వీడియోను షేర్ చేస్తూ సైనికుడికి సెల్యూట్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఓ వీడియో వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. సెలబ్రెటీలు అంతా ఈ వీడియోను షేర్ చేస్తూ సైనికుడికి సెల్యూట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆదమరిచి నిద్రపోతున్న వృద్ధురాలిని ఓ షాపు యజమాని నానా మాటలు అంటూ దూషిస్తోంటే.. అటుగా వచ్చిన ఓ సైనికుడు ఆ యజమానిపై తిరగబడతాడు. వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఇదేం పని అంటూ ఎదురుతిరిగాడు. అతడి కాలర్ పట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ బామ్మ తన కాళ్లపై పడుతోంటే వద్దని వారించాడు. ఆమెకు ఆర్థిక సాయం చేశాడు. దాదాపు 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. జవాన్‌ చేసిన పనికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకు అక్కడ జరిగిన ఘటన ఏంటంటే.. రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఓ వృద్ధురాలు ఆదమరచి నిద్రపోతోంది. అప్పుడే వచ్చిన ఆ దుకాణం యజమాని ఆ వృద్ధురాలిని వారిస్తాడు. ఏయ్.. లే.. అని గట్టిగా అరిచాడు. గాఢ నిద్రలో ఉందేమో.. ఆ వృద్ధురాలు లేవలేదు. దీంతో ఆ షాపు యజమానికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న బాటిల్ లోంచి నీళ్లను ఆమెపై పోశాడు. దిగ్గున ఉలిక్కిపడి లేచిన ఆమె.. క్షమించండయ్యా.. అంటూ ఆ షాపు యజమాని కాళ్లపై పడింది. తన కాళ్లను పట్టుకుని క్షమించమని వేడుకుంటున్నా ఆ యజమాని మనసు కరగలేదు. ఆమెను తిడుతూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో సెలవుల్లో ఇంటికి వస్తున్న సైనికుడు.. ఆ యజమాని నిర్వాకాన్ని చూశాడు. ఆ వృద్ధురాలిని నానా మాటలూ అంటున్నది చూసి తట్టుకోలేక అతడిని నిలదీశాడు. ఆ వృద్ధురాలికి అండగా నిలిచాడు. ఇప్పుడు ఈ ఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story