Video Viral: 15 రోజులకు ఒకసారి షాపింగ్.. నెల రోజులకు ఒకసారి పిజ్జా: ఒప్పందంపై సంతకం చేసిన కొత్త జంట

Video Viral: పండంటి కాపురానికి 12 సూత్రాలు.. పాత చింతకాయ పచ్చడి అయిపోయింది.. లేటెస్ట్‌గా కొత్త జాబితా తయారు చేశారు అస్సాంకు చెందిన ఓ జంట. ఈ జంట పెళ్లి తర్వాత తాము చేసుకున్న ఒప్పందంపై పెళ్లి పందిట్లో సంతకం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గౌహతికి చెందిన 24 ఏళ్ల శాంతి ప్రసాద్.. జూన్ 21న చింటూ రాయ్‌తో కలిసి జీవితాన్ని పంచుకుంది. అదే రోజు పెళ్లికి వచ్చిన అతిధుల ముందు తమ సంసార జీవితంలో చేయవలసినవి, చేయకూడనివి అంటూ ఓ జాబితా తయారు చేసి వాటిపై సంతకం చేశాడు. ఈ ఒప్పంద పత్రం వెడ్‌లాక్ ఫోటోగ్రఫీ అస్సాం వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
ఒప్పందం ప్రకారం, వధువు "ప్రతిరోజూ తప్పనిసరిగా చీరను ధరించాలి. అర్థరాత్రి పార్టీలు జీవిత భాగస్వామితో మాత్రమే అనుమతించబడతాయి. "ఆదివారం ఉదయం అల్పాహారం భర్త చేయాలని ఉంది. ప్రతి రోజు అల్పాహారం, భోజనం ఇంట్లోనే చేయాలి. ప్రతి నెలా ఒక పిజ్జా మాత్రమే తినాలి. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి షాపింగ్.. వంటివి ఉన్నాయి.
ఈ వీడియో ఇప్పటికే 39.4 మిలియన్లకు పైగా వీక్షించగా, 2.1 మిలియన్లకు పైగా లైక్ చేశారు.
వీడియోపై స్పందించిన ఒక వినియోగదారుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ప్రతిరోజూ చీర ధరించడం చాలా కష్టం అని రాశారు. మరో వినియోగదారుడు నెలకు ఒక పిజ్జా తినాలనుకోవడం.. అది కూడా ఒప్పంద పత్రంపై రాయడం బావుందన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com