డాడీ ప్లీజ్.. వాటిని తీసుకువెళ్లొద్దు.. బోరున ఏడుస్తున్న బాలుడు..!

డాడీ ప్లీజ్.. వాటిని తీసుకువెళ్లొద్దు..  బోరున ఏడుస్తున్న బాలుడు..!
సాధారణంగా ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఆట వస్తువులతో పాటుగా కుక్కలు, పిల్లులు, పక్షులను చాలా ఇష్టపడుతుంటారు. వాటిపైన చాలా ప్రేమను కురిపిస్తుంటారు.

సాధారణంగా ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఆట వస్తువులతో పాటుగా కుక్కలు, పిల్లులు, పక్షులను చాలా ఇష్టపడుతుంటారు. వాటిపైన చాలా ప్రేమను కురిపిస్తుంటారు. అవి కనిపించకపోతే ఇక అంతే బోరున ఏడవడమే.. ఇక్కడ ఓ బాలుడు కూడా అదే పని చేశాడు. సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ బాలుడి తండ్రికి కోళ్ల ఫామ్ ఉంది. ఆ కోళ్ల ఫామ్ లో ఈ బాలుడు నిత్యం పర్యటించి వాటితో సరదాగా గడిపేవాడు. అలా వాటిపైన ఎక్కడలేని ప్రేమని పెంచుకున్నాడు. అయితే కోళ్ల ఫామ్ నుంచి కోళ్లను చికెన్ సెంటర్లకు తరలించడం సాధారణమే.. అందులో భాగంగానే ఆ బాలుడి తండ్రి కోళ్లను ఒక చిన్న వ్యాన్‌లో తరలించే ఏర్పాటు చేశాడు. అయితే దీనిని చూసిన ఆ బాలుడు ఇక ఏడవడం మొదలు పెట్టాడు. డాడీ ప్లీజ్.. వాటిని తీసుకువెళ్లొద్దు అంటూ బోరున ఏడ్చాడు. రోడ్డుపై దీనంగా కూర్చుని ఏడుస్తూ వాటిని తీసుకువెళ్లొద్దని ప్రాధేయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story