Viral Video: కాలీఫ్లవర్‌లో పాము.. కుటుంబ సభ్యులు షాక్
కూరగాయలు, ఆకు కూరల్లో చిన్న చిన్న పురుగులు ఉండడం చూస్తూనే ఉంటాము. కానీ ఈ కాలీప్లవర్ లో ఏకంగా పామే ఉంది. దాన్ని చూసి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. కాలీఫ్లవర్‌లో ఉన్న చిన్న పాము జారిపోతున్నట్లు చిత్రీకరించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వర్షాకాలంలో కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలి. ఆకులు, చెట్ల మీద చిన్న చిన్న పాములు, పురుగులు లాంటివి వుంటాయి. అవి కూరల మీద చేరి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. చూసుకోకుండా ఇంటికి తీసుకువస్తే వాటిని చూసి భయపడాల్సి వస్తుంది. ఇక మార్కెట్ నుంచి తీసుకు వచ్చిన కూరగాయలైనా, ఆకు కూరలైనా ఒకటికి రెండు సార్లు పరిశీలించి కవర్లలో సర్ధి ఫ్రిజ్ లో పెట్టాలి. లేకపోతే చూసుకోకుండా ఫ్రిజ్ లో ఉంచితే పురుగులు ఏమైనా ఉంటే ప్రిజ్ లో పాకేస్తాయి.
ఇక కాలీప్లవర్ లో పాము ఉన్న వీడియోను దేవేంద్ర సైనీ అనే వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఇది ఏ రకమైన కాలీఫ్లవర్?, కోబ్రా కాలీఫ్లవర్ లేదా వైపర్ కాలీఫ్లవర్” అనే శీర్షికతో షేర్ చేయబడింది.
ఈ వీడియో, క్లిప్ నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేసింది. కూరగాయలను కొనుగోలు చేసే ముందు పచ్చి జాగ్రత్తగా తనిఖీ చేసి తీసుకోవాలి. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే విషయాన్ని దేవేంద్ర పేర్కొనలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com