Viral Video: చెవిలో దూరిన పాము.. ఈ వీడియో చూడాలంటే చాలా ధైర్యం కావాలి..

Viral Video: ప్రతి రోజు ఎవరో ఒకరు ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి.. మరికొన్ని వీడియోలు భయపెడతాయి.. నిజమేనా అనిపిస్తాయి. తాజాగా చందన్ సింగ్ అనే వినియోగదారు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో అవాక్కవుతున్నారు. అసలు చెవిలోకి పాము ఎలా దూరింది అని ప్రశ్నిస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఒక వైద్యుడు చేతికి గ్లోవ్స్ ధరించి, రోగి చెవి నుండి పామును బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించబడింది. ఒక మహిళ చెవిలో పసుపు రంగులో ఉన్న పాము దూరింది. వైద్యులు అత్యంత చాకచక్యంగా ఆ పాముని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కూడా ఏ మాత్రం భయపడకుండా చెవిలో గుబిలి తీయించుకునంటున్నట్లు కూర్చుంది.. ఆమె ధైర్యానికి కూడా మెచ్చుకోవచ్చు.
డాక్టర్ పాముని బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఇయర్‌బడ్స్, సిరంజిని కూడా ఉపయోగించారు. కాని పాముపై అవేవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వీడియో ముగిసే వరకు మహిళ చెవిలో నుండి పాము బయటకు వచ్చే సూచనలు కనిపించలేదు. చివరికి ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకున్న నెటిజన్లకు నిరాశే మిగిలింది.
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనేది స్పష్టంగా తెలియలేదు. చందన్ సింగ్ "చెవిలోకి పాము దూరింది" అనే క్యాప్షన్‌ను ఉపయోగించి షేర్ చేశాడు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పటికే దాదాపు ఈ వీడియోను 87వేల మంది వీక్షించారు. 100 లైక్‌లను సంపాదించింది. చాలా మంది వినియోగదారులు షాకయ్యాం అని పోస్టులు పెడుతున్నారు. చివరికి ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. పూర్తి వీడియోను పోస్ట్ చేయమని కోరుతున్నారు. అసలు ఆమె చెవిలోకి పాము ఎలా దూరింది చెప్పాలి అని అడుగుతున్నారు. మరొకరు దీనిని నకిలీ వీడియో అని కొట్టి పారేస్తున్నారు.
https://www.facebook.com/100078698452814/videos/3118940928417494/
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com