వైరల్

Kili Paul: టాంజానియా వరకు వెళ్లిన 'పుష్ప' క్రేజ్..

Kili Paul: సామి సామి పాట.. అందులో రష్మిక వేసే స్టెప్పులు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Kili Paul: టాంజానియా వరకు వెళ్లిన పుష్ప క్రేజ్..
X

Kili Paul: ఈమధ్య తెలుగు సినిమాలు, తెలుగు పాటలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ అయిపోతున్నాయి. భాష అర్థం కాకపోయినా కూడా ప్రపంచదేశాల్లోని చాలామంది తెలుగు సినిమా పాటలను అభిమానిస్తున్నారు. అలాగే టాంజానియాకు చెందిన కిలిపాల్ అనే సోషల్ మీడియా స్టార్ తాజాగా పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొన్నిరోజుల క్రితం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఇదే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. అందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన స్టెప్పును అచ్చం అలాగే రాజమౌళి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎందరో ప్రయత్నించారు. అందులో చాలావరకు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇప్పుడు అదే రేంజ్‌లో పుష్పలోని సామి సామి పాట కూడా వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విడుదలవ్వక ముందే పాటలే ఈ చిత్రానికి మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. అందులో ముఖ్యంగా సామి సామి పాట.. అందులో రష్మిక వేసే స్టెప్పులు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పుష్మకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా రష్మిక.. సామి సామి స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. అలా ఆ పాటతో పాటు స్టెప్ కూడా వైరల్‌గా మారింది. అందుకే ఇప్పటికీ ఎంతోమంది ఈ పాటపై రీల్స్ చేశారు. తాజాగా టాంజానియాకు చెందిన కిలిపాల్ అనే సోషల్ మీడియా స్టార్ సామి సామి పాటకు తనదైన స్టెప్పులు వేస్తూ చేసిన డ్యాన్స్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం ఆ ఒక్క పాటకే కాదు.. పుష్పలోని మిగిలిన పాటలకు కూడా కిలిపాల్ చిందులేశాడు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES