ర్యాపిడో డ్రైవర్‌గా మారిన ఐటీ ఉద్యోగి

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్‌

ఆర్థిక మాంద్యం భయాలు... వ్యయ నియంత్రణలతో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు ఉద్యోగుల తొలగింపును భారీగా చేపడుతున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఒకప్పుడు రెండు చేతులా లక్షల్లో సంపాందించిన ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. అకస్మాత్తుగా కొలువులు కోల్పోయిన ఐటీ ఉద్యోగులు చేసేది లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మరికొందరు మాత్రం నచ్చిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే బైక్‌ ట్యాక్సీలు నడుపుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన హిందుస్తాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ HCLలో జావా డెవలపర్‌.. బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. ఆర్ధికమాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బైక్‌ ట్యాక్స్‌ నడుపుతున్నట్లు.. ఆయన బైక్‌ను బుక్ చేసుకున్న ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. లవ్‌నీష్‌ ధీర్‌ అనే వ్యక్తి తాజాగా ఓ బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకున్నాడు. మార్గమధ్యలో తను ర్యాపిడో డ్రైవర్‌ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ర్యాపిడో డ్రైవర్‌ HCLలో జావా డెవలపర్‌గా చేరినట్లు.. ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది ఉద్యోగం పోగొట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. తన అనుభవానికి తగ్గట్లు మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాని, ర్యాపిడోలో పనిచేస్తే ఎక్కడ, ఏ సంస్థలో ఓపెనింగ్స్‌ ఉన్నాయో తెలుసుకోవచ్చని ఈ పనిచేస్తున్నట్లు లవ్‌నీష్‌కు తన స్టోరీని వివరించారు. లవ్‌నీష్‌ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌కు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. వెంటనే డ్రైవర్‌ స్టోరీతో పాటు అతని రెజ్యూమ్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. మీకు తెలిసిన కంపెనీల్లో ఎక్కడైనా జావా డెవలపర్‌ ఉద్యోగాలుంటే చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. ఆపోస్ట్‌ వైరల్‌ కావడంతో బైక్‌ ట్యాక్సీ ఉద్యోగి గురించి నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story